అన్నమయ్య జిల్లా .తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువు మండలం. కదిరినాయిని కోట గ్రామం వద్ద కల్తీ మద్యంతయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి పది మందిని అరెస్టు చేసినట్లు ఈడి కమిషనర్ జయరాజ్ శనివారం తెలిపారు. కల్తీ మద్యం తయారీ కేంద్రంలో,స్పిరిట్. నకిలీ తయారీకి ఉపయోగించే బాటిల్స్. క్యాన్లు యంత్రాలు మరియు వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. నకిలీ మద్యం తయారీ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.