పుంగనూరు: పుంగనూరు పోలీసు స్టేషనలో ఆయుధ పూజ,
చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ లో సీఐ సుబ్బారాయుడు, అధ్వర్యంలో ఆయుధాలు, పోలీస్ వాహనాలను ప్రత్యేకం గా పూలమాలలు మామిడి తోరణాలతో అలంకరించారు. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హరిప్రసాద్, ఏ . ఎస్ఐ. అశ్వత్ నారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.