సౌత్ జోన్ డీసీపీ చైతన్య ప్రస్తుతం కోలుకుంటున్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చైతన్యను డీజీపీ పరామర్శించారు. సెల్ ఫోన్ దొంగను పట్టుకునే క్రమంలో డీసీపీ చైతన్యకు గాయాలయ్యాయని చెప్పారు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన చైతన్య, అతని గన్ మెను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే డీసీపీ చైతన్య రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు.