ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి
అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని జాయింట్ కలెక్టర్ జాహ్నవి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్ర రూపంలో జాయింట్ కలెక్టర్కు నేరుగా అందజేశారు. ఫిర్యాదులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.