ఆళ్లగడ్డ: కానాల పల్లె గ్రామంలో జరిగిన బంగారు గొలుసు చోరీలో ఐదుగురు దొంగలు అరెస్టు
నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని కానాల పల్లె గ్రామంలో జరిగిన బంగారు గొలుసు చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు, బాధితురాలు మిడుతూరు లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు, ఎస్సై పి సుధాకర్ రెడ్డి నేతృత్వంలో బృందం సోమవారం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న బంగారు గొలుసుతోపాటు ఆటో పల్సర్ బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు