అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా బొమ్మలాట పల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు
Anantapur Urban, Anantapur | May 5, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.