పెద్దవూర: నాయకుని తండా గ్రామం నందు నూతన విద్యుత్ సబ్- స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన: ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ మండలంలో నాయకుని తండా గ్రామం నందు రెండు కోట్ల 80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ పనులకు ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అభివృద్ధి జరిగే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విద్యుత్తు సకాలంలో అందించడంతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రైతు రుణమాఫీ అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తుందన్నారు