కామారెడ్డి: కామారెడ్డిలో స్వర్ణకార సంఘం ఎన్నికలు, శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఎన్నిక
కామారెడ్డిలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి 7:00 వరకు పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఓటు హక్కు కలిగిన స్వర్ణకారులు అధికారుల పర్యవేక్షణలో తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం వెలువడిన ఫలితాల ప్రకారం, మరికంటి శ్రీనివాస్ అధ్యక్షుడిగా, బస్వాపురం ప్రభాకర్ ప్రధాన కార్యదర్శిగా, శేషు కుమార్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని సంఘం ప్రతినిధులు సన్మానించారు.