టేక్మల్: మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన మొహరం వేడుకలు
Tekmal, Medak | Jul 5, 2025 మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం పీర్ల పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. నూతన రంగురంగుల అవసరాలతో పేర్లను తయారు చేసి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. కుల మతాలకు అతీతంగా సామరస్యంగా పండగ వేడుకలు ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటామని ముస్లిం మత పెద్దలు తెలిపారు.