నంద్యాల అర్బన్: డోన్,ప్యాపిలి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | Apr 30, 2026
నంద్యాల జిల్లా పోలీస్ వ్యవస్థలో క్రమశిక్షణ, పారదర్శకతను పెంచేందుకు జిల్లా ఎస్పీ సునీల్ షరాన్ తనిఖీలు చేపట్టారు. డోన్తో పాటు ప్యాపిలి పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఆయన, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులకు సూచించారు.