కనిగిరి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలతో 1411 కేసులు పరిష్కారమైనట్లు జూనియర్ సివిల్ జడ్జ్ రూపసిరి తెలిపారు. అందులో క్రిమినల్ కేసులు 103, సివిల్ కేసులు 17, భరణం కేసులు 3, గృహహింస కేసులు 2, చెక్ బౌన్స్ కేసులు 7,STC కేసులు 1279 పరిష్కారం అయ్యాయన్నారు. రాజీమార్గంలో లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చని, రాజీమార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఇరువర్గాలు గెలిచినట్లేనని జడ్జి తెలిపారు.