ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో కబేళా మార్కెట్ ఉన్న రోడ్లపైనే జంతువు వధ, ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆదివారం వచ్చిందంటే ఆర్లగడ్డ పాత బస్టాండ్ నుంచి సిఎస్ఐ చర్చి వరకు వెలిసిన మటన్ మార్కెట్ల వద్ద రోడ్లపైనే జంతు వధ చేస్తూ వ్యాపారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ప్రధానంగా కుక్కలు ఇక్కడ అధికంగా సంచరిస్తూ బైకులపై వచ్చి పోయే వారిపై దాడులు చేస్తున్నాయని, మున్సిపాలిటీ వారు ప్రత్యేక కబేలా మార్కెట్లో కబేల వీధిలో ఏర్పాటు చేసిన ఫలితం శూన్యమని మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే మటన్ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు