పుంగనూరు: గూడూరుపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా ఇద్దరికీ గాయాలు .
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన రైతులు శంకరప్ప, కేశవ, ద్విచక్ర వాహనంలో బట్టందొడ్డి గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్ళతుండగా మార్గమధ్యంలో గూడూరు పల్లి సమీపంలో ద్విచక్ర వాహన అద్భుతప్పి బోల్తాపడడంతో పడి ఇద్దరు గాయపడ్డారు, గాయపడ్డ వారిని హైవే ఆంబులెన్స్ సిబ్బంది పైలట్ సయ్యద్, ఈ ఏం టి. కిరణ్ కుమార్, పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలు తెలియాల్సి ఉంది. ఘటన మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వెలుగులో వచ్చింది.