గుంతకల్లు: మండలంలోని నెలగొండ గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని నెలగొండ గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జయరామిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ, ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పీపీపీ విధానం వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించి వాటికి వ్యతిరేకంగా నాయకులు సంతకాలను సేకరించారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే కూటమి ప్రభుత్వం ప్రైవేట్ చేస్తోందని అన్నారు.