కమలాపురం: వల్లూరు : బస్టాండు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని వల్లూరు బస్టాండు వద్ద శనివారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. సిఐ ఎస్కే రోషన్, ఎస్సై పెద్ద ఓబన్న ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీల భాగంగా అనుమానిత ద్విచక్ర వాహనాలు,కార్లు,ఇతర వాహనాల్లో తనిఖీలు చేపట్టారు. వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.