కడప: గ్రామాల్లో సుస్థిర ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయాలి: కలెక్టర్ శ్రీధర్
Kadapa, YSR | Sep 25, 2025 స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో సుస్థిర ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయాలని.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి డ్వామా, ఉద్యాన, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. "ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా నీటి భద్రత - గ్రామీణాభివృద్ధి" అనే అంశంపై.. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర జలశక్తి అభియాన్ శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ సంబందిత శాఖల కార్యదర్శులతో కలిసి.. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్ లోని విసి హాలు నుండి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి హాజరయ్యరు.