బోయిన్పల్లి: మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన బిజెపి శ్రేణులు
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండల కేంద్రంలో, బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఎడవల్లి పరశురాం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6:20 నిమిషాలకు మీడియా సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా పరుశురాం మాట్లాడుతూ,ప్రధానమంత్రి మోడీ ప్రజల సంక్షేమాన్ని తాత్కాలిక ఆదాయ నష్టాల కంటే ప్రాముఖ్యత ఇచ్చి మరోసారి ధైర్యమైన నిర్ణయం తీసుకుని జీఎస్టీ నిర్మాణాన్ని సులభతరం చేసిందన్నారు, ప్రతిరోజు వినియోగించే వస్తువులు సేవలపై పన్ను తగ్గడంతో ఇంటి ఖర్చులు తగ్గుతాయి,చిన్న వ్యాపారులకు పన్ను విధానం సులభతరం అవడం వల్ల వ్యాపారవేత్తలకు ఊతం లభిస్తుంది,ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు,