నంద్యాల అర్బన్: మహానంది మండలంలో పట్టుబడిన వన్యప్రాణి వేటగాళ్లకు ఈనెల 27వ తేదీ వరకు రిమాండ్
Nandyal Urban, Nandyal | Jul 14, 2026
మహానంది మండలం బుక్కాపురం శివారులో కరెంట్ తీగలు అమర్చి అడవి పిల్లి, అడవి పందిని వేటాడిన ఇద్దరు వేటగాళ్లను అధికారులు అరెస్ట్ చేశారు. వన్యప్రాణుల మాంసంతో పాటు వేటకు ఉపయోగించిన సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వీడియో డౌన్లోడ్ అవుతుంది