వీణవంక: చల్లూరు గ్రామంలోని PHC లో మెడికల్ ఆఫీసర్, ఖాళీ పోస్ట్ లను భర్తీ చేయాలి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు సుంకరి సంపత్
వీణవంక: మండలం చల్లూరు గ్రామంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు సుంకరి సంపత్ మండల కార్యదర్శి పిల్లి రవి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం మధ్యాహ్నం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల క్యాంపెయిన్ లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది అన్నారు. పి హెచ్ సి లో పర్మినెంట్ మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్టు, హెడ్ నర్సు తో పాటు నాలుగు ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.