చంద్రబాబు,నరేంద్ర మోడీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకే ప్రయత్నం చేస్తున్నారు విజయనగర్ కాలనీలో మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని విజయనగర్ కాలనీ వద్ద సిరికల్చర్ కార్యాలయంలో 12:30 గంటల సమయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీఐఐసి సంబంధించిన ప్లాటెడ్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు నాయుడు అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాడని అందుకు కేంద్రం కూడా సహకారం అందిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.