అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 3 నుండి 7వ తేదీ వరకు జీపు యాత్ర చేపట్టినట్టు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ఎం హరూన్ రషీద్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం జీపు జాత పోస్టర్లను ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి విడుదల చేశారు. ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల అధ్యక్షులు రాజేష్ నాయకులు అభిషేక్ పవన్ అరవింద్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.