నంద్యాల అర్బన్: ప్రతి ఒక్కరు యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలి నంద్యాల యోగ న్యాచురోపతి డాక్టర్ రామకృష్ణారెడ్డి
Nandyal Urban, Nandyal | Jun 18, 2026
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రోటోకాల్ యోగా కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ శశికళ ఆధ్వర్యంలో నిర్వహించారు. యోగా-న్యాచురోపతి డాక్టర్ గుమ్మడి రామకృష్ణారెడ్డి విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. ఆరోగ్య కరమైన, ఆనందకరమైన సమాజాన్ని నిర్మించాలనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయం అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు