మెగా డీఎస్సీ నియామక పత్రాల అందజేత కార్యక్రమం పై సీ.ఎస్ వీడియో కాన్ఫరెన్స్,అభ్యర్థులకు బస ఏర్పాట్లు చేయాలని ఆదేశం
Ongole Urban, Prakasam | Sep 17, 2025
అమరావతిలో ఈ నెల 19వ తేదీన జరిగే డీఎస్సీ నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో డీఎస్సీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అందరినీ గురువారం రాత్రికి ఒకచోట చేర్చి శుక్రవారం ఉదయం వారిని అమరావతికి తరలించాలని ఆయన ఆదేశించారు.ఒంగోలులోని 3 ఇంజనీరింగ్ కళాశాలలలో వారికి బస ఏర్పాటు చేస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఈ సందర్భంగా సి.ఎస్ కు తెలిపారు