డేగానిపల్లిలో వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు.
అన్నమయ్య జిల్లా. తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట మండలం డేగాని పల్లి గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపి. వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రి తరలించారు. ఘటన సోమవారం చోటుచేసుకుంది.ఘటనపై బి. కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.