బనగానపల్లె: ఖరీఫ్ లో సాగు చేసిన పంటలు నమోదు చేసుకోండి :కొలిమిగుండ్ల మండల ఏవో శారద
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన రైతులు వివరాలను ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని కొలిమిగుండ్ల మండల వ్యవసాయ అధికారి శారదా దేవి సూచించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల నష్టాలను ప్రభుత్వం అంచనా వేసినప్పుడు పంట నమోదు తప్పకుండా ఉండాలని అన్నారు.