బనగానపల్లె: నందవరం లో వైభవంగా చౌడేశ్వరి అమ్మవారికి పల్లకి సేవ
బనగానపల్లె మండలం నందవరంలోని చౌడేశ్వరి దేవి అమ్మవారికి శుక్రవారం పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారిని పల్లకీలో ఆశీనులను చేసి, ప్రత్యేక అలంకరణలతో శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ ఊరేగింపులో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది