ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలంలోని మసీదుపురానికి చెందిన భూషప్ప(24) అనే యువకుడు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..
ఎమ్మిగనూరు మండలంలోని మసీదుపురానికి చెందిన భూషప్ప(24) అనే యువకుడు మంగళవారం తెల్లవారుజామున కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. భూషప్ప నవంబరు 30వ తేదీన పురు గుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. చికిత్స కోసం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పో యాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ విషాద సంఘటనతో ఆ కుటుంబంలో విషయాలు అమ్ముకున్నాయి. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.