కడప రోడ్డులోని ఆర్ఎంపీ క్లినిక్‌లో వైద్యం పొందిన మహిళ గురువారం మృతిచెందిన ఘటనపై అధికారులు స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) భారతి శుక్రవారం మైదుకూరులోని ఆర్ఎంపీ క్లినిక్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హత కలిగిన వైద్యుల వద్దనే ప్రజలు చికిత్స పొందాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్య పరీక్షలు నిర్వహించే ఆర్ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దర్యాప్తులో నిబంధనలను ఉల్లంఘించిన ఓ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు.