కోడుమూరు: కోడుమూరు ఉర్దూ పాఠశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం, ఎంఈఓ హాజరు
కోడుమూరు పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఈఓ వసంత లక్ష్మి బాయి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం మొదటి విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకవచ్చారని కొనియాడారు. ఆయన పలు భాషల్లో ప్రావీణ్యం సాధించారని తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆజాద్ కు భారతరత్న బిరుదు వరించిందన్నారు. ఆయన పుట్టినరోజునే జాతీయ విద్యా దినోత్సవం జరుగుతుందన్నారు.