తిరువూరు పట్టణంలో గోడ కూలి నలుగురికి తీవ్ర గాయాలు
Tiruvuru, NTR | Sep 22, 2025 తిరువూరు పట్టణంలోని తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గత నాలుగు రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా తిరువూరు పట్టణంలోని శాంతినగర్ లో నర్సరీ గోడ కూలి నలుగురు కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలం చేరుకున్న స్థానికులు నలుగురిని ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన అధికారులు గోడ తొలగించి బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించారు