వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ గుండు వద్ద ర్యాష్ డ్రైవింగ్ కలకలం రేపింది. ముగ్గురు మైనర్ బాలురు స్కూటర్ (చేతక్) పై అతివేగంతో వచ్చి, పండ్లు విక్రయిస్తున్న మహిళను ఢీకొట్టారు. అదే సమయంలో చంటి పాపతో పండ్లు కొనడానికి వచ్చిన మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం.