నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో పంట పొలాల్లో బాతుల సందడి
Nandyal Urban, Nandyal | Apr 5, 2026
వరి కోతలు పూర్తి అయితే చాలు చెన్నై, తమిళనాడు ప్రాంతాల నుంచి బాతులు పంట పొలాల్లోకి వచ్చేస్తాయి. మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో వరి సాగు అధికంగా ఉండటంతో వరి కోతలు అయిన తర్వాత బాతుల యజమానులు వాటిని పంట పొలాల్లోకి తీసుకొస్తారు. రైతులతో బాతుల యజమానులు మాట్లాడుకుని వరి పొలాల్లోని గింజలను తినేందుకు వదిలిపెడతారు. బాతులు పంట పొలాల్లోని క్రిమి కీటకాలను సైతం తినేయడంతో చీడపీడల తీవ్రత తగ్గుతుంది.