నాంపల్లి: నాంపల్లి కోర్టు లో పూచికత్తు లపై సంతకాలు చేసి న్యాయమూర్తి కి అందజేసిన అల్లు అర్జున్
బెయిల్ పూచికత్తు లపై సంతకాలు చేసేందుకు నాంపల్లి కోర్టు కు చేరుకున్నాడు సినీ హీరో అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటన లో అల్లు అర్జున్ ను ఏ 11 నిందితుడిగా చేర్చి అరెస్టు చేసిన నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో నేడు కోర్టు కు వచ్చి పూచికత్తు పై సంతకాలు చేసి న్యాయమూర్తి కి అందజేశారు అల్లు అర్జున్