జహీరాబాద్: కక్కరవాడలో ప్రేమ వివాహం నచ్చక అబ్బాయి ఇంటికి
ప్రేమ వివాహం నచ్చక అబ్బాయి ఇంటిపై దాడి చేసి నిప్పంటించిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో చోటుచేసుకుంది. కక్కరవాడ గ్రామానికి చెందిన ముదిరాజ్ కృష్ణ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన గొల్ల విట్టల్ కుమార్తె మౌనికను 10 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం నచ్చకపోవడంతో దీన్ని మనసులో పెట్టుకొని మౌనిక కుటుంబ సభ్యులు అబ్బాయి తండ్రి బోయిని రాములు పై దాడి చేయడంతో పాటు ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆరిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.