ఒంగోలు అర్బన్: ఒంగోలు వైసిపి ఇన్ ఛార్జ్ రవి బాబు పై వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఇందిరా తీవ్ర ఆగ్రహం, సస్పెండ్ చేయడంపై నిలదీత
Ongole Urban, Prakasam | Apr 26, 2026
ప్రకాశం జిల్లా మాజీమంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిశానని సస్పెండ్ చేయడంపై ఒంగోలు వైసిపి మహిళా అధ్యక్షురాలు ఇందిరా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియా సమావేశం ఇందిరా మాట్లాడుతూ, గతంలో ఒంగోలు వైసిపి ఇన్ ఛార్జ్ చుండూరు రవి బాబు ఏ విధంగా టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను కలిశారని ప్రశ్నించారు. బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి టిడిపి ఎంపీని కలవలేదా అన్నారు. దళితులను కాబట్టే వివక్ష చూపిస్తున్నారు.