బనగానపల్లె: అవుకు రిజర్వాయర్ లో నీళ్లు లేక వరి సాగుకు బ్రేక్
నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ కింద ఏటా వరి విస్తారంగా సాగుచేస్తారు. ఈ ఏడాది దానికి బ్రేక్ పడింది.రిజర్వాయర్లో నీరు అడుగంటిపోవడంతో రైతులు సాగు చేయవద్దని అధికారులు సూచించారు. రిజర్వాయర్ పాత కట్ట రివిట్మెంట్ కూలడంతో.. ఇందులో నిల్వ చేసిన నీటిని కడప జిల్లాకు తరలించారు. దీంతో అవుకు రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఫలితంగా రిజర్వాయర్ పరిధిలోని వేలాది ఎకరాల్లో వరి సాగుకు నోచుకోలేదు.