పలమనేరు: కళ్యాణ రేపు జలపాతం లో గల్లంతైన యూనిస్ కుటుంబ సభ్యులను పరామర్శించి అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసిన ఎమ్మెల్యే
పలమనేరు: పట్టణం పాతపేట పోలీస్ లైన్ వీధిలో నివాసం ఉంటున్న యూనస్ గత రెండు రోజులు ముందు కళ్యాణ రేవు జలపాతంలో గల్లంతైన విషయం విధితమే. నేడు పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి యూనిస్ కుటుంబీకులను కలిసి పరామర్శించారు. పోలీసు మరియు అగ్నిమాపక శాఖ అధికారులను ఫోన్లో సంప్రదించి గల్లంతైన యూనిస్ ఆచూకీ కనిపెట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కల్యాణ రేవు జలపాతం ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకుని సాధ్యమైనంత త్వరగా యూనిస్ ను నీటి నుండి బయటకు తీసుకురావాలన్నారు.