ఆళ్లగడ్డ: రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు
యువత స్వచ్ఛందంగా రక్తదాన సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు, ఆదివారం ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీం రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు సూచించారు, ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శబరీవ్, డాక్టర్ బండారు గిరీష్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు