ఒంగోలు అర్బన్: మహిళ ఆశ్రమం మహిళలను కలిసి మనోధైర్యాన్ని కల్పించిన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Ongole Urban, Prakasam | May 4, 2026
హౌసింగ్ బోర్డ్ లో ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి చేత నిర్వహించబడుతున్న నిరాశ్రయ మహిళా ఆశ్రమం అనగా శక్తి సదన్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినా నాగమణి సందర్శించడం జరిగింది. ఆమె మహిళా ఆశ్రమంలోని నివాసితులను కలుసుకొని వారితో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు .అలాగే మేనేజ్మెంట్ బాధ్యులైన సంస్థ అధ్యక్షులు తేళ్ల అరుణ మరియు బీరం అరుణలతో కూడా హోం కున్న పరిస్థితుల గురించి చర్చించారు .అప్పటికప్పుడే స్థానిక ఎమ్మార్వో ని ఇంకా ఇతర ఉద్యోగస్తులను గ్యాస్ ఏజెన్సీస్ వారిని పిలిపించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించింద