రాయచోటి పట్టణంలో మద్యం దుకాణాలపై ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గురు ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో విక్రయాలు తప్పనిసరిగా AP ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా జరగాలని ఆయన ఆదేశించారు. కొనుగోలు చేసిన మద్యం నాణ్యతపై అనుమానం ఉంటే, ప్రజలు అదే యాప్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చని సూచించారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ గురు ప్రసాద్ హెచ్చరించారు. మద్యం విక్రయాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని దుకాణ యజమానులను ఆదేశించారు.