గుంతకల్లు: ఇంటర్మీడియట్ సెకండియర్ లో గుత్తి మండల టాపర్ గా మోడల్ కాలేజీ విద్యార్థిని భూమిక
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. గుత్తిలోని మోడల్ కాలేజీ విద్యార్థిని భూమిక ఎంపీసీలో 1000 మార్కులకు గాను 986 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. గుత్తి మున్సిపాలిటీ తో పాటు మండల వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీల విద్యార్థుల అందరి కంటే భూమిక అత్యధిక మార్కులు సాధించి టాపర్గా నిలిచినట్లు మోడల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రతిష్ట కుమారి గురువారం చెప్పారు. మండల టాపర్ గా నిలిచిన భూమిక ను అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.