బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో టిప్పర్ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు 6 మందికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలోని నెల్లూరు-ముంబై హైవేపై టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. చాగలమర్రికి చెందిన ట్రావెల్స్ బస్సు తాడిపత్రి మండలం హాజీవలి దర్గాకు పుట్టు వెంట్రుకల శుభకార్యం నిమిత్తం ప్రయాణికులతో వెళ్తూ..కొలిమిగుండ్ల వద్ద డీజిల్ బంకులోకి వెళ్తున్న టిప్పరు ఢీకొట్టింది. దీంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ రమేశ్ బాబు సహాయక చర్యలు చేపట్టారు.