కర్నూలు: మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకం: రాష్ట్ర మంత్రి టిజి భరత్
మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో డా.మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జరిగిన మైనారిటీ సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డా. అబుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయుల జీవితాలు, వారి ఆచరణ విద్యార్థులకు ప్రేరణ కావాలన్నారు. భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గొప్ప విద్యావేత్త అని, ఆయన చదువుల