పలమనేరు: ముసలమడుగు వద్ద ఏర్పాటుచేసిన కుంకీ ఎలిఫెంట్ హబ్ లో పర్యటించి ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పలమనేరు: సమీపంలో ఏర్పాటు చేసిన ముసలమడుగు కుంకి ఏనుగుల కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఏనుగుల విన్యాసాలు వీక్షించి గజరాజులకు ఆహారం అందించారు. మొక్కలు నాటి శిలాఫలకం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్, డి ఎఫ్ ఓ సుబ్బరాజు, పవిత్ర జిల్లా యంత్రాంగం కూటమి నేతలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.