గుర్రంపోడు: పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్డుకునేందుకు యత్నించిన బిజెపి నాయకులు, అరెస్టు చేసిన పోలీసులు
నల్గొండ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించేందుకు వచ్చిన నేపథ్యంలో బిజెపి నాయకులు అడ్డుకునేందుకు ఎక్కించారు. దీంతో పోలీసులు బిజెపి నాయకులను సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేసి గుర్రంపొడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో పిల్లి రామరాజు యాదవ్, బండారు ప్రసాద్, మరికొందరు కౌన్సిలర్లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అన్నారు. మంత్రి కోమటిరెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను సొంత క్యాంపు కార్యాలయంగా ప్రారంభించడం సరైనది కాదన్నారు. మంత్రి తీరు మార్చుకోవాలని హితవు పలికారు.