నంద్యాల అర్బన్: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలి :నంద్యాల శెట్టి టీం సభ్యులు
Nandyal Urban, Nandyal | May 19, 2026
బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రజల సహకారం కావాలని శక్తి టీం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల మండలం పెద్ద కొట్టాలలో ఉపాధి కూలీలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై వివరించారు. బాల్య వివాహాలు జరిగితే సమాచారం అందించాలన్నారు. పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఆడపిల్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు