ఒంగోలు అర్బన్: ఒంగోలు జాతి ఎడ్ల ప్రత్యేకతను కొనియాడిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రైతులకు అందాల్సిన సంక్షేమం అందిస్తామని వెల్లడి
Ongole Urban, Prakasam | Apr 24, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు జాతి ఎడ్లు ప్రత్యేకమైన మని అందమైనవని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎడ్ల జాతిని కొనియాడారు. ఒంగోలు ఎడ్ల జాతిని పెంచే రైతులు తమ కడుపున మాడుచుకొని ఎడ్లకు డ్రై ఫ్రూట్స్ పెడతారని వాటికి చల్లటి ఏసీలలో విశ్రాంతినిచ్చి వారు ఆరు బయట పడుకుంటారని అన్నారు. రైతులకు కూడా ఒంగోలు ఎడ్ల జాతి ఎడ్లంటే ఎంతో ప్రేమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు అందాల్సిన సంక్షేమం అందిస్తామని ఎంపీ అన్నారు.