పుంగనూరు: చౌడేపల్లిలో పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం .చౌడేపల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయం వద్ద సిఐ రాంభూపాల్ రెడ్డి, అధ్యక్షతన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాంభూపాల్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు మాట్లాడుతూ ప్రజల కోసం ఆరాటపడే పోలీసులు సమాజంలో అందరికీ ఆదర్శ పాయలు అన్నారు. కుటుంబాలను సైతం లెక్కచేయకుండా సమాజ రక్షణ ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగేశ్వరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.