కోనారావుపేట: ప్రతి సంవత్సరం మాకు 100 టన్నుల యూరియా అవసరం ఉంటుంది:రైతులు రాజు,కిషన్ రెడ్డి
యూరియా కోసం రైతన్నలు రాస్తారోకో చేపట్టారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గం పరిధిలోని జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో మంగళవారం సుమారు 11:44 నిమిషాలకు రైతులు యూరియా కోసం రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతి సంవత్సరం తమకు 100 టన్నుల యూరియా అవసరమంటుందని,ఇప్పటివరకు ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదని రైతులు ముత్యాల కిషన్ రెడ్డి, జవ్వాజి రాజు గౌడ్ లు ఆవేదన వ్యక్తం చేశారు.