జహీరాబాద్: ఈనెల 14న రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు: బీసీ కుల సంఘాల నాయకులు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రభుత్వం కుట్రలు చేస్తే సహించేది లేదని బీసీ సంఘం నాయకులు అన్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలులో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 14న నిర్వహించనున్న రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీసీలమంత ఏకమై బిసి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.